కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 :  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని  ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకొని పార్టీకి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం  వెల్దండ మండలంలోని రాచూర్,  మాడ్గుల మండలంలోని ఫల్గు తండా, చంద్రయన్ పల్లి,  అన్నబోయిన పల్లి, కడ్తాల్ మండలం మైసిగండి గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది నాయకులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కసిరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వలన తెలంగాణ రాష్ట్రం రాలేదని,  తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అని వారు తెలిపారు. కేసీఆర్ బీసీ బంధు, దళిత బంధు అంటూ ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ఇది ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. మోసపూరిత మాటలను ఇక ప్రజలు నమ్మరని  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *