కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ ఎస్  పార్టీ లో  చేరిన  ఇంద్రనగర్  ఆటో డ్రైవర్లు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఇంద్రనగర్ ఆటో స్టాండ్ 30 మంది కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్  పార్టీ లో  చేరారు. ఇంద్రనగర్ ఆటో స్టాండ్  సీనియర్ నేతలు, ఆటో డ్రైవర్లు 30 ఏళ్లుగా పార్టీకి పని చేస్తూ, పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీని వీడి  ఉప్పల్‌ సీనియర్‌ నాయకుడు నీలంరెడ్డి, కార్పొరేటర్‌ ప్రభుదాస్‌, డివిజన్‌ ​​అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి  సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. డివిజన్ పరిధిలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇంద్రనగర్ ఆటో స్టాండ్ వారు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వారిని  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పానుగంటి ఉపేందర్, నాగలక్ష్మి నర్సింహా, పంగ రాజు, కృష్ణ, సంపత్, విజయ్, గౌడ్, రవి, కుమార్, బొండాల కుమార్, బిల్డర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *