కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 4: కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని 29వ వార్డు కన్యాలాల్ లో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓబిసి కోఆర్డినేటర్ కాపు మధు ప్రవీణ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ మహిళా పార్టీ పట్టణ అధ్యక్షురాలు పల్లవి శివానంద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజానీకాన్ని తీరని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు. వికారాబాద్ అభివృద్ధి జరగాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి ప్రసాదన్నను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం విశ్వాసం ఏర్పడిందని కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డినాయక్ కౌన్సిలర్ దేవి ఆనంద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *