షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలవాలని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గం నుండి కీలక నాయకులతో కలిసి షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలి వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు పలువురు కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలువురికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడాలని సూచించారు. అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆయా గ్రామాల సర్పంచులకు ఇతర సీనియర్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్టిలో చేరిన వాళ్ళు వీరే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువాలు కప్పుకున్న నాయకులు పార్టీలో చేరిన వారిలో కొత్తూరు సుదర్శన్ గౌడ్, పెంజర్ల నేత మామిడి సిద్ధార్థ రెడ్డి, లింగందాన సర్పంచ్ ప్రతాప్, వేముల నర్వ సర్పంచ్ మంజుల మల్లేష్, ఎదిరె సర్పంచ్ బాల్రాజ్, కాసుల వాద సర్పంచ్ గోపాల్, బీజాపూర్ సర్పంచ్ రాములు, కొందుర్గు నేత కావలి యాదయ్య, రామచంద్రపూర్ సర్పంచ్ జహంగీర్, వెంకిర్యాల సర్పంచ్ లింగం గౌడ్, చౌలపల్లి ఉపసర్పంచ్ శ్రీను, చించోడు మాజీ సర్పంచ్ సింగిల్ విండో చైర్మన్ అనంతం, కొత్తూరు ఎంపీటీసీ శీను, అప్ప రెడ్డి కూడా వార్డు సభ్యులు మంచిర్యాల ప్రభాకర్, ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ వెంకటేష్, ఇప్పలపల్లి ఉపసర్పంచ్ రాములు, చౌదరి గూడ ఎక్స్ ఎంపీటీసీ బస్వరాజ్ గౌడ్, చౌదరి గూడ ఎక్స్ వైస్ ఎంపీపీ బాబు, వార్డ్ మెంబర్లు, సాలెబోని రాములు, నంది కంటి బాలయ్య, ప్రభాకర్, చంటి, రాఘవేందర్, మరియు వీరి కార్యవర్గం సుమారు ఐదు వందల మందితో పార్టిలో చేరినట్టు ప్రకటించారు..




