సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం జడ్పీటీసీ వినీల నరేష్ హైదరాబాదులో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో బుధవారంబీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ లో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. జహీరాబాద్ లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగిందని, ఇకపై కూడా జహీరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావును గెలిపించుకుందామని అభివృద్ధిని కొనసాగిద్దామని ఆయన కోరారు. వినీల నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి వల్ల బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరినట్టు వివరించారు.నియోజకవర్గంతో పాటు తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి




