కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ఉప్పల్ ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  చిల్కానగర్    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీ జండా ఎగరవేయడం  ఖాయమని అన్నారు.  కారు గుర్తుకే ఓటు వేసి ఉప్పల్లో టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. చిల్కానగర్ డివిజన్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్క కొండల్ రెడ్డి,పైడిపాల శ్రీనివాస్ ప్రజాపతి,జాలిగపు శ్రీనివాస్,కొండల్ రెడ్డి,నరేందర్ రెడ్డి,శంకరా చారి,స్వామి శ్రీకాంత్,సిద్దులు,శివ తదితరులకు బండారి లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చారు.  ఈ కార్యక్రమం లో చిల్కానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *