కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 21 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లిలో 4వ రోజు గడప గడపకు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కరుణ శ్రీ కేశవులు ముఖ్యఅతిథిగా పాల్గొని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లి గ్రామ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి  భారీ మెజార్టీతో గెలిపించాలని  కోరారు.ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు మానయ్య, కాంగ్రెస్ నాయకులు వస్పుల జంగయ్య, జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, అబ్దుల్ ఖాదర్, శివలింగం, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అలీం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ నాజర్, ఫరీద్,  కరీం, మహేష్, బాబా, జలాల్, రాజు, శ్రీను, శ్రీధర్ నాయక్, రాగ్య, గోపాల్, రవినాయక్, పూల్యా నాయక్, శ్రీనివాసరెడ్డి, పర్వతాలు, శ్రీను, హరిప్రసాద్, తిరుమలేష్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *