కాంగ్రెస్ జెండా మోయని వారికి టికెట్ ఇవ్వకూడదు..!

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏనాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోయని పార్టీ బలోపేతానికి కృషి చేయని నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే తామందరం వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.  మాపై కేసులు పెట్టిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రస్తుతం ఆయన స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే టికెట్టు ఇచ్చేస్తారా..? అని పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రశ్నించారు.. పార్టీకి కష్టపడే నాయకుల, కార్యకర్తల ఆత్మస్తైర్యం దెబ్బతినేలా కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటును కోల్పోయే నిర్ణయం తీసుకోవద్దని పలువురు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకున్న పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులను గుర్తించి సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు. గ్రామస్థాయిలో క్యాడర్ బలోపేతం కోసం కష్టపడ్డ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి పూర్తి వైభవం తెచ్చిన నాయకుడికి టికెట్టు ఇవ్వాలని కోరారు. మరల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సర్వే నిర్వహించి కార్యకర్తల అభీష్టం మేరకు  గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, యంపిటిసిలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల ఎన్ ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, బిసి సెల్ నాయకులు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *