వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: ఏఐఎంఎం అధినేత అసద్ దిన్ ఓవైసి బిఆర్ఎస్ మేనిఫెస్టోను పొగడిన విధానాన్ని తప్పు పట్టిన టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా. ఈ సందర్భంగా వహీద్ మియా మాట్లాడుతూ అసద్ బాయ్ హంకో బిక్ నహి హక్ చాహియే అసద్ మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేసిన కేసీఆర్ ఓ రకంగా ఓటమిని ఒప్పుకున్నట్టే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ స్నేహితుడికి గత తొమ్మిది సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీల ఉన్నతికి తోడ్పడిన విషయాలను బహిర్గతం చేసి శ్వేత పత్రం విడుదల చేయమనండి అని సవాలు విసిరారు. నాడు సీఎం కేసీఆర్ తమిళనాడు తరహాలో గెలిచిన 3 నెలలకే 12% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చేయని యెడల నా తల నరుక్కుంటటనని చెప్పి ముస్లిం ఓట్లతో గెలిచి మాట మార్చిన విధానాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని ప్రశ్నించారు. మీకు ఇంతకీ ముస్లింల పైన ప్రేమ ఉన్నట్టా లేదా రాజకీయంగా ముస్లింలను వాడుకునలే అని మీ సిద్ధాంతమా అని పేర్కొన్నారు.బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లో అసలు ముస్లిం గురించి ఏదైనా పథకం ఉందా? మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పెషల్ ఉర్దూ మీడియం స్కూల్స్ వీటిపై మేనిఫెస్టోలో లేనందుకు మీకు సిగ్గుగా లేదా అని మండిపడ్డారు. సన్న బియ్యం అమలు చేస్తున్నాం అని స్వయాన సీఎం పలుమార్లు మీడియా ముఖంగా చెప్పి నేడు మేనిఫెస్టోలో మేము అధికారంలో వస్తే సన్న బియ్యం పంపిణీ చేస్తాం అని చెప్పడం ద్వారా ఇప్పటివరకు సన్న బియ్యం పంపిణీ అమలు కాలేదనే విషయం ఒప్పుకున్నట్టే అని అన్నారు.
తెలంగాణ జనాభాలో 60 లక్షలు కలిగి 14% ఉన్న ముస్లింలకు కెసిఆర్ ఏమి చేశాడని వారి తరఫున ముస్లిం సమాజానికి ఓటు అడుగుతారు అని పేర్కొన్నారు. నెత్తిన టోపీ పెట్టుకుని అలయి బలయి తీసుకొని ఇఫ్తార్ విందులు ఇచ్చి, రంజాన్ పండుగకి 200 రూపాయల రంజాన్ తోఫా అని దుస్తులు ఇస్తే సరిపోతుందా అని అన్నారు. నవాబుల బతికిన మనం వీరి ఎంగిలి మెతుకులకు తలోగ్గుదమాఇఫ్తార్ విందు పేరుతో 80 కోట్ల నిధులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అదే నిధులను పేద ముస్లిం విద్యార్థుల కోసం పాఠశాలలు ఎందుకు కట్టలేక పోతుంది అన్నారు. ఈ విషయం పైన ఏనాడైనా మీ భాగస్వామి అయిన బిఆర్ఎస్ ని ప్రశ్నించారా అనిపెర్కొన్నారు.దళితులకు పది లక్షల దళిత బంధు ఇస్తే అసద్ మీరు ఏనాడైనా ముస్లిం బందు ప్రవేశపెట్టి మాకు కూడా పది లక్షలు ఇవ్వాలని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించార అని పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో ముస్లిం సమాజం తరఫున మీ గొంతు వినిపించాల్సిన కనీస ధర్మాన్ని మరిచి బిజెపి, బిఆర్ఎస్ తో లోపాకారి ఒప్పందం కుదుర్చుకొని మా ముస్లింలకు ఇంకెన్ని సంవత్సరాలు వాడుకుంటారు అని పేర్కొన్నారు.బిఆర్ఎస్ పాలనలో మతత్వం ఆర్ఎస్ఎస్ భావజాలాలు తెలంగాణలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది పదేళ్లుగా హేతువాద, ప్రజాసామిక, అభ్యుదయ మీద బిఆర్ఎస్ అణచితవేతనే దీనికి నిదర్శనం అన్నారు.రైతు పక్షపాతి అనే కెసిఆర్ ఇప్పటివరకు 100% రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నాడు అసెంబ్లీలో ఏనాడైనా మీ ఎంఐఎం వాళ్లు ప్రభుత్వాన్ని నిలదీశారా?. కేవలం పట్టణాలలో నివసించే మీకు గ్రామీణ ప్రాంత రైతుల కష్టాలు వారి యొక్క సాధక బాధలు అర్థమవుతాయ రైతుల ఆత్మహత్యలు మీ కంటికి కనబడుట లేదా అని పేర్కొన్నారు.మీకు ముస్లింల పైన సవతి తల్లి ప్రేమ వుంది తెలంగాణ నుండి ఓ ముస్లిం దేశ రాజకీయాల వరకు ఎదుగుతుంటే మా షబ్బీర్ అలీ మీద మీరిద్దరూ కుట్ర పని స్వయాన కెసిఆర్ ఆయనపై పోటీ చేయడం మీ కుట్రలో భాగమే ఈ విషయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మీకు మీ మిత్ర బిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదు అని హెచ్చరించారు.వర్క్ బోర్డ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయో! ఎంత అన్యక్రాంతమయ్యాయో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపి ముస్లింలకు న్యాయం చేస్తాం అన్నారు. దయచేసి ఇకనైనా ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా బిజెపి కి లాభం చేకూర్చే పనులు మానుకొని సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అని టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా పేర్కొన్నారు.





