కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : కర్నాటక తరహాలో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలు అమలుచేస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, దూలపల్లి పాక్స్ ఛైర్మన్ గరిశే నరేందర్, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, డి.పోచంపల్లి మాజీ సర్పంచ్ యాదగిరి ముదిరాజ్ లు శనివారం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కర్రోళ్ళ సదానందం, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, దూలపల్లి పాక్స్ డైరెక్టర్ డప్పు నరేందర్, మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్, ఓబిసి సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గడ్డమీది భరత్ గౌడ్, 131 డివిజన్ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, 127 డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ ఖాన్, సంపత్, నరేశ్ గౌడ్, మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




