కాంగ్రెస్ గూటికి బి ఆర్ ఎస్ నాయకుడు విక్రం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6: బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుతోటపల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు  ముత్తోజు విక్రమ్ , ఉపాధ్యక్షుడు వెంకటరమణ కాంగ్రెస్ గూటికి  చేరారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విక్రమ్, వెంకటరమణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారికి ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *