ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచెడు గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన జహంగీర్, ప్రమాదవశత్తూ మరణించిన రావిచెడ్ కోమలపల్లి మల్లేష్, అదేవిధంగా మద్దేలకుంట తండాలో 3 రోజుల క్రితం చనిపోయిన రాంజ్యా నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రావిచేడ్ గ్రామ సర్పంచ్ విటలయ్య గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్ధన్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదయ్య, సీనియర్ నాయకులు బొప్పిడి యాదయ్య, రామస్వామి, ధర్మా నాయక్, వార్డు మెంబర్ పారేశా, కడ్తాల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్, గ్రామ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్, రుప్లా నాయక్, కడ్తాల్ మండల ఎన్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ వంశీ, పవన్, శివ, బిచ్య, నరసింహ, రాకేష్ , హరి, శ్రీను, రమేష్ తదతరులు పాల్గొన్నారు.




