ప్రజలకు 500కే గ్యాస్ సిలిండర్
గుజరాత్ మోడల్ అంటే వ్యాపారవేత్తల పాలన
ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటన
అహ్మదాబాద్, సెప్టెంబర్ 5 : ఎన్నికలు సవి•పిస్తున్న వేళ గుజరాత్లో..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందస్తు హావి•లు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హావి• ఇచ్చారు. భాజపా.. వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తుందని, రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 సబ్సిడీ ఇస్తామన్నారు. బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హావి• ఇచ్చారు. అహ్మదాబాద్‌లో పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ హావి•లు గుప్పించారు.
గుజరాత్ మోడల్ అంటే ఇద్దరు ముగ్గురు వ్యాపార వేత్తల పాలన మాత్రమేనని ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలకు మాత్రం ఎంత కావాలంటే అంత భూమి కేటాయిస్తారు.. కానీ పేదలు, ఆదివాసీలు చేతులు జోడించి కొద్ది భూమి ఇవ్వమని వేడుకున్నా.. అది వారికి లభించదు అని మండిపడ్డారు. ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాహుల్ పర్యటన ప్రారంభించారు. అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పారు. 3 వేల ఆంగ్ల మాద్యమ పాఠశాలలు నిర్మిస్తామని.. బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్ హావి• ఇచ్చారు. ’భాజపా ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేస్తుంది.
రైతులకు చేసిందని ఎప్పుడైనా విన్నారా’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ పటేల్ ఎవరి కోసమైతే పోరాడారో, ఏ ప్రజల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో వారికే అది వ్యతిరేకంగా పనిచేసిందని ధ్వజమెత్తారు. భాజపా ప్రవేశ పెట్టి రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు.. రైతుల హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయన్నారు. గుజరాత్‌లోని ప్రతి సంస్థను భాజపా స్వాధీనం చేసుకుందని.. ఇక్కడ యుద్ధం రెండు పార్టీల మధ్య కాదు, అధికారపక్షం స్వాధీనం చేసుకున్న ప్రతి సంస్థతో అని ఆయన ఆరోపించారు. ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ విషయంలో, ముఖ్యంగా ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ విషయంలో ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు.


