ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతామని, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కో ఆప్షన్ మెంబర్ జహంగీర్ బాబా అన్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా, మండల కేంద్రంలోని పలు కాలనీలలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యానాయక్ తో కలసి శుక్రవారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలపై ప్రజలకు వివరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. మహాలక్ష్మీ పథకం మహిళలకు ప్రతి నెల రూ.2500తో పాటు, రూ.500కే సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. గృహజ్యోతి క్రింద ప్రతి కుటుంబాలనికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా క్రింద ప్రతి రైతుకు ఏడాదికి ఏకరాకు రూ. 15 వేలతో పాటు, కౌలు రైతులకు రూ. 12 వేలు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి పాటుపడుతుందని, కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, జంగయ్య, శ్రీకాంత్, యాదగిరి, కర్రోళ్ళ నర్సింహా, కంబాలపల్లి సాయిలు, గుర్రాల జంగయ్య, సిద్దిగారి శ్రీను, ఎర్రోళ్ల దశరథ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల నిర్మాణం





