కాంగ్రెస్,బిజెపి పార్టీలను తరిమి కొట్టాలి బిఎస్పీ పార్టీకి ఓటు వేయాలి   

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటె బిఎస్పి పార్టీ అధికారంలోకి రావాలని పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్ని రోజులని బహుజన బిడ్డలు పరిపాలనకు దూరంగా ఉంటారన్నారు.బహుజనులంతా ఏకమైతే పాలకులవుతారు, అవసరమా అనుకుంటె బానిసలుగా తయారైతరన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి నాయకులు తమ ఇంటి ముందరికి వచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు.చదువుకున్న వారందరూ వారికి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలన్నారు.ఐదు సంవత్సరాలలో ఒక్కరోజు మీ ఇంటికి రాని వాళ్ళు ఇప్పుడు మీ యొక్క ఓటును వేయించుకున్నాలనే ఉద్దేశంతో మీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ప్రచారంలో భాగంగా చేవెళ్ల మండలంలోని గొల్లగూడ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మేనిఫెస్టోను ప్రతి గడపకు తిరిగి ప్రచారం చేసారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎస్పీ పార్టీ రంగారెడ్డి జిల్లా వెస్ట్ జోన్ అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బర్లు,దళితబందు మొదలగు స్కీములు అంటూ మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.బహుజనులకు న్యాయం జరగాలంటె మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటె బహుజన్ సమాజ్ పార్టీ అధికారం లోకి రావాలన్నారు..బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి రాజా మహేంద్ర వర్మను బలపరిచి మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల అధ్యక్షులు మొకరం కుమార్,యువజన అధ్యక్షులు రాజు,గ్రామ అధ్యక్షులు చించలం రాజు,మహేష్,నరేష్, రాఘవ,అనిల్, శ్రీనాథ్,శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *