- కర్నాటకలో ప్రజలు కరెంటు కష్టాలు అనుభవిస్తున్నారు
- రాజేందర్…చిలుక పలుకులొద్దూ..
- ధర్మం తప్పింది నువ్వు…తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది నువ్వూ
- కొరోనా టైమ్‌లో నీ జాతికి ఏం చేశావో చెప్పు?
- అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టిండు
- ఈటలపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు
- గజ్వేల్-ప్రజ్ఞాపూర్ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 17 : కాంగ్రెస్‌ది 42 పేజీల మేనిఫెస్టో కాదని, అది 420 మేనిఫెస్టో అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదనీ అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తుందనీ, పేజీలకు పేజీలు రాశారన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు. కర్నాటకలో కరెంట్ కష్టాలు చూస్తున్నామనీ, ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. 420 మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రజల ముందుకు తెచ్చిందనీ, జనం ఎక్కడ కొడతారో అని 24 గంటల కరెంట్ ఇస్తామనీ మేనిఫెస్టోలో పెట్టారనీ, ఈ ఆచరణ సాధ్యం కానీ హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తుందా…అని అడిగారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం మేము అమలు చేస్తున్నవేననీ, బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఇక ఈటల రాజేందర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది సిఎం కేసీఆర్ అని, అన్నం పెట్టిన కేసీఆర్‌కు సున్నం పెట్టిన చరిత్ర రాజేందర్‌ది అని హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
శుక్రవారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ…ఈటల రాజేందర్‌ను ఫ్లోర్ లీడర్ చేసింది కేసీఆర్, మంత్రిని చేసింది కేసీఆర్ అని కేసీఆర్ అన్ని విధాలుగా రాజేందర్‌కు భిక్ష పెడితే ధర్మం తప్పింది రాజేందర్ అని, తిన్నింటి వాసాలు లెక్కిపెట్టింది రాజేందర్ అని…ఇప్పటికైనా చిలుక పలుకులు మానుకోవాలని మంత్రి హరీష్‌రావు హితవు పలికారు. ఇటీవల కొందరు కొత్తగా వొచ్చి ఏదేదో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. రాజేందర్ ఎప్పుడైనా గజ్వేల్‌కు వొచ్చాడా…అని ప్రశ్నించారు. ఇప్పుడు వొచ్చి బిడ్డా..బిడ్డా అంటూ మాట్లాడుతున్న రాజేందర్ కొరోనా టైంలో ఏనాడైనా గజ్వేల్‌కు వొచ్చినవా…కొరోనా బాధితులకు పైసా సాయం చేశావా..కనీసం నీ జాతీకి ఏం చేశావో చెప్పాలన్నారు. వోట్ల కోసం సెంటిమెంటు డైలాగులు కొడితే ప్రజలు వినరనీ, ఇదీ ఉద్యమాల గడ్డ అని రాజేందర్ తెలుసుకోవాలన్నారు.
మల్లన్నసాగర్‌లో బెస్ట్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కడితే మంచిగ కట్టలేదనీ ఇప్పుడు రాజేందర్ అంటున్నాడనీ, ఆ కాలనీ కట్టేటప్పుడు ఆర్థిక మంత్రిగా ఉంది రాజేందరే కదా? అప్పులు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా ఈటెల రాజేందర్.. ఆప్పుడు ఇంకో 10లక్షల రూపాయలు ఇచ్చేది ఉండేదన్నారు. రెండేళ్లు అరోగ్య మంత్రిగా చేశావనీ, అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నావ్. గొప్పొడు అన్నావ్. పార్టీ మారంగనే మాట మార్చావ్. గజ్వేల్ అభివృద్ధి చెందినట్టు హుజురాబాద్‌ను చేశావా…అని ప్రశ్నించారు. వోట్ల కోసం ఝూటా మాటలు మాట్లాడుతున్నాడనీ, అన్నం పెట్టిన కేసీఆర్‌ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు అని అన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడనీ, అబద్దాలు ఆడితే అతికేటట్టు ఉండాలన్నారు. బిజెపిలో చేరిన రాజేందర్ గజ్వేల్‌కు ఏం చేశారో చెప్పాలన్నారు. 400రూపాయల గ్యాస్ సిలిండర్‌ను 1200రూపాయలు చేశారన్నారు. సిఎం కేసీఆర్ మాత్రం 1200రూపాయల సిలిండర్‌ను 400రూపాయలకే ఇస్తానని చెప్పారన్నారు. సిఎం కేసీఆర్ అందరివాడన్నారు.





