షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిద్దాంకోందుర్గు మండలం సోమారం పాడు గ్రామంలో భీమిడి అశోక్ రెడ్డి తదితరుల భారీ ప్రచారం‘ఎలక్షన్ వచ్చిందంటే రకరకాల ఆగం చేసే పనులు జరుగుతయనీ ఆగమైపోతే వచ్చే ఐదేళ్లు కూడా ఆగం కావాల్సి ఉంటుందనీ షాద్ నగర్ నియజక వర్గంలో ఆలోచించి పని చేసే ఎమ్మేల్యే అంజయ్య యాదవ్, ప్రజలకు సేవచేసే ఆయనకు ఓటు వేస్తే షాద్ నగర్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనీ షాద్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, మరో సీనియర్ నాయకులు భీమిడి అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. కోందుర్గు మండలం సోమారం పాడు గ్రామంలో టిఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీరు తప్పకుండా నిలబడ్డ అభ్యర్థి ఎటువంటి వారు, అవకాశం ఇస్తే ఎట్ల పని చేస్తడు ? ప్రజల ఎలా అందుబాటులో ఉంటారు, అభివృద్ధి కోసం ఎట్ల తండ్లాడుతడు అని ఆలోచన చేయాలని అన్నారు. ప్రతి అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడిక, దృక్పథం ఏంది ఆలోచించాలని కోరుతున్నామని, అలాగే అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూడాలి’ అని పిలుపునిచ్చారు.‘బీఆర్‌ఎస్ 15 సంవత్సరాలు హోరాహోరీగా కష్టపడి తెలంగాణ సాధించిందని కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజలు వద్దు మొర్రె అని మొత్తుకుంటున్నా కూడా జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపారనీ, 50 ఏళ్లు అరిగోసపడ్డాం అని ఆకలి చావులు, బతుకపోవుడు, మంచినీళ్లు లేకుండే.. కరెంటు లేకుండే. రైతుల ఆత్మహత్యలు మన కండ్ల ముందటే జరిగినయ్ అనీ కరువుతో బతుకపోయారనీ దేవుడి దయతో వర్షం పడితే ఒక పంట పండినట్లు లేకపోతే లేనట్టు అంత ఘోరంగా ఈ ప్రాంతం ఉండే అన్నారు. మీ ఆశీర్వచనంతో బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది. ఏం చేసిందో ప్రజలకు మీ కండ్ల ముందటనే ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని చూసింది. కాంగ్రెస్ పార్టీ రూ.200 పెన్షన్ ఇస్తే బీఆర్‌ఎస్ రూ.2వేల పెన్షన్ ఇస్తున్నది. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రూ.2వేలు ఇచ్చే పెన్షన్‌ను రూ.5వేలు ఇస్తాం. మనమే గెలుస్తున్నాం. అందులో డౌట్ లేదు. ఆ తర్వాత రూ.5వేల పెన్షన్ ఇస్తాం’ అని తెలిపారు…
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే ఆపద మొక్కులు ఉంటాయి జాగ్రత్త




