కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ ఇవ్వని కోర్టు.. 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

న్యూదిల్లీ, మే 14 : దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బెయిల్‌ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢల్లీిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్‌ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక విచారణ జరిగింది. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జుడీషియల్‌ కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *