కవితకు నోటీసులకు…తెలంగాణకు ఏం సంబంధం

  • కవిత వ్యాఖ్యలపై బిజెపి నేతల ఎదురుదాడి
  • తప్పు చేసి తప్పించుకునే యత్నాలు
  • చట్టం ముందు ఎవరైనా తలవంచక తప్పదు
  • బిజెపి నేతలు బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, తదితరుల వ్యాఖ్యలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు కేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కవితకు ఈడీ నోటీసులపై బీజేపీకి సంబంధమేమిటని మండిపడ్డారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌  ‌ఘాటుగా స్పందిస్తూ… కేసీఆర్‌ ‌బిడ్డ కవిత తెలంగాణ పరువు తీశారన్నారు. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని విమర్శలు గుప్పించారు. సీబీఐతో బీజేపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే కవిత తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్‌ ‌విసిరారు. ఎవరు అవినీతి చేసినా.. చట్టానికి అతీతులు కాదన్నారు. కవిత లిక్కర్‌ ‌కుంభకోణాన్ని తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎంతో మందిని విచారణ సంస్థలు విచారించాయని… కవిత కొత్తేం కాదని బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు చేశారు.
కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ ‌నేత కిషన్‌ ‌రెడ్డి స్పందిస్తూ…లిక్కర్‌ ‌దందా చేసింది వి•రు.. అక్రమంగా కోట్లు సంపాదించింది వి•రు.. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటీ అని నిలదీశారు. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారని కేంద్రమంత్రి ప్రశ్నించారు. చేసిన తప్పులు అన్నీ చేసి.. వి• తప్పులపై నోటీసులు ఇస్తే.. తెలంగాణ సమాజానికి ముడిపెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడీ నోటీసులివ్వడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరును బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తలవంచదంటూ స్పందించటాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదంటున్నారు. కవిత వ్యాఖ్యలకు బీజేపీ నిజామాబాద్‌ ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌  ‌కౌంటర్‌ ఇస్తూ…తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు కానీ  ఇప్పుడు దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో వారి ప్రమేయం ఉందని ఈడీ చెప్పడంతో  దేశం ముందు సిగ్గుతో తలవంచుతుందని విమర్శించారు.
2014 నుంచి 2018 వరకు కేసీఆర్‌ ‌కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదన్నారు. దీనికి కవిత ఆధిపత్య ధోరణె కారణమన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయి తర్వాత నెపోటిజం కోటాలో ఎమ్మెల్సీ అయిన కవిత లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక కుట్రదారుగా ఉన్నారన్నారని ఆరోపించారు. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పేరుతో  కవిత జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష చేస్తున్నారని విమర్శించారు. లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితతోపాటు అందరికీ నోటీసులు ఇచ్చారని..ఆమెకు ప్రత్యేకంగా ఏవి• ఇవ్వలేదని బీజేపీ మహిళా నేత డీకే అరుణ అన్నారు. దీన్ని కక్ష సాధింపుగా బీఆర్‌ఎస్‌ ‌రాజకీయం చేస్తుందని..తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే కాదని.. తెలంగాణ సమాజం అని వ్యాఖ్యానించారు.  మహిళలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని..ఈడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *