కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: అమీన్ పూర్ మున్సిపల్, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 11 లక్షల రూపాయల విలువైన చెక్కులను అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిరుపేదలకు ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *