కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : కళా నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించి అవార్డులు అందించడం అభినందనీయం అని లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. 77 వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిటీ కల్చరల్ లో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే మెగా అవార్డ్స్ 2023 ఆల్ టాలెంటెడ్ గ్రేట్ ఏచీవర్స్ డిఫరెంట్ క్యాటగిరిలో ఎంపికైన కళాకారులకు అవార్డులు  అందజేసినట్లు మెగా రికార్డ్ క్రియేషన్స్ అధ్యక్షులు పి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా చిల్లా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కళలను గౌరవిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్న పి.శ్రీనివాస రావుని అభినందనీయుడు అని కొనియాడారు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అతిధిలుగా దైద పద్మా రెడ్డి, నక్కా యాదగిరి, డా.ఎం.అనురాధా దాస్, జిసి.రెడ్డి, కందుకూరి శ్రీనివాస్, సిహెచ్.శ్రీనివాస్ హాజరైన ఈ కార్యక్రమంలో మొగిలి ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఖమ్మం జిల్లా స్వర సుధ మ్యూజికల్ అసోసియేషన్ కళాకారుల దేశభక్తి, సినీ, ఆధ్యాత్మిక గీతాలు, శిరీష డాన్స్ స్టూడియో స్టూడెంట్స్ డాన్స్ ప్రదర్శన, ఖమ్మం సింగర్ నాగసాయి వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవార్డుకి ఎంపికైన అభ్యర్థులు కమెడియన్ మొగిలి గుణకర్, మ్యూజిక్ డైరెక్టర్ కొమర్రాజ్ మాధవరావు, సీనియర్ సినీ గాయకులు వివి.రెడ్డి, డైరెక్టర్ తోకల రవితోపు, డప్పు కళాకారుడు రేగళ్ల లక్ష్మీనారాయణ, జి.గోవర్ధన్ రెడ్డి, ఎం.సతీష్ కుమార్, ఎస్.జీవన్ రెడ్డి, యోగా రుక్మిణి, ఆర్.శ్రీనివాస్, డా. దీక్షితుల సుబ్రహ్మణ్యం, ఆర్.శిరీష, యస్.నాగరాజు, ఎం.వంశీ త్రినాథ్, చోడవరపు వైష్ణవి, వి.సంకీర్త్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *