ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 17 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన రాజకీయ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లోని రాజీవ్ శెట్టి నగర్, కర్మన్ ఘాట్ లో నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గ బిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలపై చర్చించారు, ఈ సమావేశానికి కల్వకుర్తి రాజకీయ ఐక్య వేదిక ను ఏర్పాటు చేసినట్లు వారు ప్రకటించారు.ఈ సమావేశంలో కల్వకుర్తి నియజకవర్గానికి చెందిన కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తి, మాడుగుల, చారగొండ, తలకొండపల్లి, వెల్దండ ఆరు మండలాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీసీ నుంచి ఎవరిని నిలబెట్టాలి లేక ఎవరికి మద్దతు తెలిపాలి అనే విషయాలపై అభిప్రాయాలు తీసుకొని చర్చించినట్లు సమాచారు. అదే విధంగా బరిలో నిలువాలా లేక ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే విషయాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలోమాడుగుల మండల సుద్దపల్లి గ్రామ సర్పంచ్ తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు గౌడ్, ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏ. నారాయణ, సామాజిక వేత్త గౌని నరసింహ గౌడ్, తిరుపతయ్య ముదిరాజు, ఏం. తిరుమలేష్, గాజుల పద్మనాభం, శ్రీనివాస్, ఏం విజయకుమార్ గౌడ్, సిహెచ్ నరసింహ, నరేందర్, ఆమనగల్ ,శ్రీనివాస్ గౌడ్, నరహరి, బ్రాహ్మణ పెళ్లి మాజీ సర్పంచ్ ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్, చారగొండ బీసీ సంఘం అధ్యక్షుడు అంజయ్య గౌడ్, విటాయిపల్లి పర్వతాలు, వివిధ గ్రామాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
కల్వకుర్తి రాజకీయ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం





