కల్వకుర్తి నియోజకవర్గం లో 83.26% పోలింగ్ నమోదు

మొత్తం వోటర్లు 2, 41742
పోలైన వోట్లు 201, 285
ఆమనగల్లు, ప్రజాతంత్ర  డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో గురువారం జరిగిన పోలింగ్ లో 83.26% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాలు 2 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 2,41742 మంది ఓటర్లు ఉన్నారు.  జరిగిన ఎన్నికల్లో 201,285 మంది పురుష, మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాలు వారిగా పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి కడ్తాల మండలం 28,122, తలకొండపల్లి మండలం 31, 622, కల్వకుర్తి మండలం 45,190, వెల్దండ మండలం 28,353, చారగొండ మండలం 6030, ఆమనగల్లు మండలం 25, 842, మాడుగుల మండలం 36,126 ఆయా మండలాలుగా వారిగా నమోదైన పోలింగ్ వివరాలు ఇలా.. మొత్తం 201,285 ఓటర్లతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *