ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది దీంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని 262 పోలింగ్ బూత్ లకు సంబంధించి 2,41, 742 ఓటర్లు ఉన్నారు. ఇందులో సాయంత్రం ఐదు గంటల వరకు 64% పోలింగ్ నమోదైనట్లు ఇంకా పోలింగ్ జరుగుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. దాదాపుగా 17 24 మంది పోలింగ్ సిబ్బందిని విధులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 80 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల వరకు 20 శాతం 11 గంటల వరకు 39.5 శాతం 3 గంటల వరకు 60 శాతం 5 గంటల వరకు 64% పోలింగ్ నమోదైనట్లు అధికారుల ద్వారా తెలిసింది. 5 గంటలైనా ఓటర్లు క్యూలో నిలబడి వోటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీను తెలిపారు. సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీ జి. నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ రవికుమార్, సిఐలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, ఎస్సై బలరాం, హరిశంకర్ గౌడ్, సాయుధ బలగాలు స్థానిక పోలీసులతో గట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలింగ్ బూత్ లకు పంపించారు. చరవాణి లను పోలింగ్ బూత్ లో తీసుకెళ్లకుండా నియంత్రించారు. కొత్తగా వోటరు నమోదు చేసుకున్న యువతీ యువకులు వృద్ధులు దివ్యాంగులు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కల్వకుర్తిలో ప్రశాంతంగా పోలింగ్





