కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడపిల్లలకు ఓ వరం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఓ వరం  అని తాండూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కోట్‌పల్లి మండలానికి చెందిన 6 మందికి షాదీ ముబారక్, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడబిడ్డలకు కొండంత ఆస రాగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళ సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని, అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ముఖ్యమంత్రి ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పెద్దముల్ మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *