కలెక్టరేట్ లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్  పాల్గొని, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సర్దార్  వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు.
అనంతరం  కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బందిచే రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞను చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతో దేశానికి సమకూరిన అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు తోడ్పాటును అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో  డిఆర్ఓ నగేష్,  వివిధ శాఖల అధికారులు,కలెక్టరేట్ ఏ.ఓ, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *