ఆయన…
ఓ మహర్షి
ఓ మహామనీషి
ఆ అస్తిత్వం అద్వితీయం
ఆ వ్యక్తిత్వం ఆదర్శనీయం

ఓ శాస్త్రవేత్త
ఓ సాహితీవేత్త
ఆ వర్ఛస్సు అఖండ తేజం
ఆ మేధస్సు విజ్ఞాన బాండం

ఓ శ్రామికుడు
ఓ స్వాప్నినికుడు
ఆ హాసం కడలి తరంగం
ఆ చూపు కరుణామృతం
ఓ సత్య శోధిత
ఓ నిత్య విద్యార్థి
ఆ ప్రసంగం ప్రణవనాదం
ఆ ప్రవచనం ప్రమోదగీతం

కలలు కనండి…
సాకారం చేసుకొండంటు
యువతను మేలుకొల్పిన
నవయుగపు  ప్రభాతుడు

దేశ రాష్ట్రపతి పదవికి
వన్నెలద్దిన మిన్నకాడు

వింగ్స్ ఆఫ్‌ ‌ఫైర్‌,‌మై జర్నీ
ఇన్‌ ‌సైడర్‌ ‌మ్యాన్‌ ‌వంటి
ఉద్గ్రంధాల సాహితీ రేడు

భారతరత్న పద్మభూషణ్‌
అవార్డులు పొందినవాడు

ఈ తరానికి యూనిక్‌ ‌మ్యాన్‌
ఆయనే ఎపి జె అబ్దుల్‌ ‌కలాం

ఆ మహిమాన్వితునికి
అఖిల జన విజయ హారతి
నిఖిల జగతి వినమ్ర ప్రణతి

( జులై 27 న ఎపి జె అబ్దుల్‌ ‌కలాం  వర్థంతి సందర్బంగా …)
కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *