కర్నాటకలో మళ్లీ విజయం బిజెపిదే

  • యెడ్యూరప్ప, బొమ్మైల నాయకత్వంలో ముందుకు
  • పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ‌ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా

బెంగళూరు, ఫిబ్రవరి 24 : కర్నాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా వ్యక్తంచేశారు.  బిజెపి అభివృద్ధి మంత్రం, ప్రతిపక్షాల దుష్పచ్రార తంత్రాల మధ్యే ఎన్నికలు జరుగనున్నాయని 150కు పైగా స్ధానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌ధీమా వ్యక్తంచేశారు. ఇన్‌చార్జిగా నియమితులైన తర్వాత సహ ఇన్‌చార్జిలు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవియా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అణ్ణామలైలతో కలిసి విచ్చేసిన ఆయనకు దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేరుగా మల్లేశ్వరంలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని భారతమాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

తదుపరి ఆయన డియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని, ప్రధాని ఈసారి కర్ణాటక(ఐజీసనిజీబిజీజీ)కు తన అమూల్య సమయంలో అధికభాగం కేటాయిస్తుండం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. పార్టీజాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌లు కూడా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారన్నారు. బీజేపీ అందరి పార్టీగా గుర్తింపుపొందిందని ప్రత్యేకించి రైతులు, మహిళలు, దళితులు, బలహీనవర్గాలు ఇలా అన్ని వర్గాల ఆదరణను చూరగొంటోందన్నారు. దక్షిణాదిన కర్ణాటక బీజేపీకి కంచుకోటగా ఉందన్నారు. యడియూరప్ప, బసవరాజ బొమ్మైల సారథ్యంలోనే ఎన్నికలకు వెళతామని పార్టీ నేతల మధ్యఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తమది అభివృద్ధి అజెండా కాగా ప్రతిపక్షాలది విధ్వంసభరిత అజెండా అని అభివర్ణించారు. ఈ సందర్భంగా బెంగళూరు సెంట్రల్‌ ‌లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌ ‌కూడా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *