రాహుల్ వెంట నడిచిన మల్లికార్జున ఖర్గే
శనివారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మంథని అంబేద్కర్ నగర్ చెందిన యువకుడు సింగారపు శివరామకృష్ణ తో 3d పెయింటర్ బళ్లారిలో వేసిన పెయింటింగ్ ను రాహుల్ గాంధీ కి వివరిస్తున్న ఎఐసిసి కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ..
బళ్లారి,అక్టోబర్15: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ప్రజలు వేలాదిగా తరలివచ్చి రాహుల్ వెంట నడుస్తున్నారు. బళ్లారి జిల్లాలోని హలాకుంది గ్రామంలో 38వ రోజు ఈ యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ కూడా ఉన్నారు. సెప్టెంబర్ 7 కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర వెయ్యి కిలోటర్లకు చేరుకుంది.
బళ్లారిలో బహిరంగ సభ తరువాత ఈ యాత్ర తిరిగి ఏపీలోకి ప్రవేశిస్తుంది. అయితే నిన్న దాదాపు12 కిలోటర్లు ఏపీలో యాత్ర చేశారు. మళ్లీ సాయంత్రం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోకి రాహుల్ జోడో యాత్ర ప్రవేశించింది. ఇక ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించనుంది. 23న కొద్ది సేపు మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తారు. 24, 25న పాదయాత్రకు బ్రేక్ ఉంటుంది. 26 నుంచి రాహుల్ యాత్ర తిరిగి కొనసాగుతుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. మొత్తం 13 రోజుల పాటు 375 కిలోటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి మక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఆ తర్వాత హైదరాబాద్ దుగా మద్నూర్ వరకు కొనసాగుతుంది.




