బెంగళూరు,మే29 : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే శివకుమార్.. వైఎస్ షర్మిల వద్ద గుర్తు చేశారు. మరోవైపు.. వైఎస్ షర్మిల మే 15వ తేదీన డీకే శివకుమార్ బర్త్ డే రోజు కూడా భేటీ అయ్యి.. శుభాకాంక్షలు తెలిపారు.మరోమారు అధికారం చేపట్టిన తరవాత ఆమె శుభాకాంక్షలు తెలిపారు.




