వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 16: కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారా కరెంటు ఇవన్నీ కాంగ్రెస్ ను గెలిపించుకుంటారా అని ప్రజలను ప్రశ్నించి కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కోరారు. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శాసనసభ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ తో కలిసి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వికారాబాద్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీ రామారావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని సాధించుకున్న తెలంగాణలో పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందన్నారు. ఒక్కసారి అవకాశం కావాలని కోరుతున్న కాంగ్రెస్ 11 సార్లు ఇక్కడ అధికారం చేపట్టి ఏమి అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మళ్లీ అభివృద్ధిలో వెనుకబడి పోతామని ఢిల్లీ నాయకుల చేతుల్లోకి పాలన వెళుతుందని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేశామని మరోసారి అవకాశం ఇస్తే 5000 వరకు పెన్షన్ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఇంట్లో మహిళలకు నెల నెల ఇంటి ఖర్చులకు 3000 రూపాయలు ఇస్తామని తెలిపారు. 400కే గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళల అభివృద్ధికి తోడ్పాటున అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పొలాలకు మూడు గంటలు కరెంటు సరిపోతుందని రైతులకు నష్టం చేసే పని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ కావాలా కాంగ్రెస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని కోరారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుకల ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేర్చారని అదేవిధంగా జిల్లాకు మెడికల్ కళాశాల డిగ్రీ కళాశాల బ్రిడ్జి నిర్మాణానికి 96 కోట్లు మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వికారాబాద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆనందును మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ మండలాల నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి




