కరెంట్‌ ‌కావాలా..? కాంగ్రెస్‌ ‌కావాలా ఆలోచించాలి

సంగారెడ్డి కి మెట్రో రావాలన్న, ఐటీ హబ్‌ ‌కావాలన్న అది కేసీఆర్‌ ‌కే సాధ్యం
•ఏసీ బస్సులు పెడతాం…కరెంట్‌ ‌తీగలు పట్టుకును చూడండి..రేవంత్‌, ‌జగ్గారెడ్డిలకు మంత్రి
కేటిఆర్‌ ‌సవాల్‌..•సంగారెడ్డి లో కేటిఆర్‌ ‌రోడ్‌ ‌షో సక్సెస్‌

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవసంబర్‌ 8: ‘‘‌కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌వచ్చింది.కరెంట్‌ ‌పీకింది. కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వకపోతే రైతులు మోసళ్ళు తీసుకువచ్చి సబ్‌ ‌స్టేషన్‌ ‌ముందు ధర్నాలు చేస్తున్నారు. మనకి కరెంట్‌ ‌కావాలా..? కాంగ్రెస్‌ ‌కావాలా ఆలోచించాలి. కాంగ్రెస్‌ అం‌టే దొంగరాత్రి కరెంట్‌. ‌కాంగ్రెస్‌ ‌వాళ్లు ఒక్క చాన్స్ అం‌టూ బతిలాడుతున్నారు. 11 సార్లు ఇస్తే ఏం చేశారు. ఏం పీకారని మీకు చాన్స్ ఇవ్వాలి. ఇటువంటి కాంగ్రెస్‌ ‌సన్నాసులకి ఇంకా ఎందుకు చాన్స్ ఇవ్వాలి.రేవంత్‌ ‌కి కరెంట్‌ ‌కనపడటం లేదట. మాకు సవాల్‌ ‌విసిరారు.రేవంత్‌, ‌జగ్గారెడ్డి లకు రెండు ఏసీ బస్సులు పెడుతా, దమ్‌ ‌బిర్యానీ పెడుతాము. సంగారెడ్డి నియోజకవర్గంలొని ఏ గ్రామానికి వెళుతారో వెళ్ల మనండి. అక్కడికి వెళ్లి కరెంట్‌ ‌తీగలు పట్టుకుం టే తెలుస్తది. వారు పోతారు..పీడా పోతది.’’ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కే తారక  రామా రావు అన్నారు. సంగారెడ్డి లో ని కంది మండలంలోని కింగ్స్ ‌డాబా నుండి సంగారెడ్డి గంజ్‌ ‌మైదానం వరకు రోడ్‌ ‌షో నిర్వహించారు.వేలాది బైక్‌ ‌ర్యాలీపెద్ద ఎత్తున నిర్వహించారు.

మంత్రి రోడ్‌ ‌షో సక్సెస్‌ అయింది. అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రి కేటిఆర్‌ ‌మాట్లాడుతూసంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డి కి కొత్త వ్యక్తులు వస్తారనిఏవేవో హామీలు ఇస్తారని అన్నారు. రాహుల్‌ ‌గాంధీబెంగాల్‌ ‌కి పోయి దిది బీజేపీకి బీ టీం అని, ఢిల్లీకిపోయి కేజ్రీవాల్‌ ‌ని బీజెపికి బీ టీం అని , తెలంగాణకు వచ్చి   బిఆర్‌ఎస్‌ అని అంటున్నారని మండిపడ్డారు. బీజేపీతో కేసీఆర్‌ ఎప్పటికి కలవరని, మాది సెక్యులర్‌ ‌పార్టీ అని స్పష్టం చేశారు. మేము బిజెపికి బీ టీం అయితే మైనారిటీల కోసం ఎందుకు సంక్షేమ పథకాలు పెడుతామని ప్రశ్నించారు. ప్రతిపక్షాలవి అసత్య ఆరో పణలు చేస్తున్నాయని అన్నారు.ప్రధాని మోడీ వచ్చి కాంగ్రెస్‌ ‌తో కేసీఆర్‌ ‌కలిశారని చెబుతారని, రాహుల్‌ ‌గాంధీ వచ్చి బీజేపీతో కేసీఆర్‌ ‌తో కలిశారని,కవితని అరెస్ట్ ‌చేయలేదని బిజెపి, బి ఆర్‌ ఎస్‌  ఒక్కటే అంటారని అన్నారు.మరి సోనియా, రాహుల్‌ ‌గాంధీ లను ఎందుకు అరెస్ట్ ‌చేయడం లేదని ప్రశ్నించారు. జగ్గారెడ్డి నేను కాంగ్రెస్‌ ‌లో గెలిచి బి ఆర్‌ ఎస్‌  ‌లోకి వెళ్తా అని ప్రచారం చేస్తున్నాడట, అలా చేస్తే చింతా ప్రభాకర్‌ ‌గెలుపు కోసం నేను ఎందుకు వస్తా అని అన్నారు.

బక్క పలుచటి కేసీఆర్‌ ‌ని ఎదుర్కోవడానికి షేర్లు, బబ్బర్‌ ‌షేర్లు, తీస్‌ ‌మార్‌ ‌ఖాన్‌ ‌లు వస్తున్నారని, ఎంత మంది వచ్చినా సరే సింహం సింహం సింగిల్‌ ‌గా వస్తుందని  అన్నారు. ఒక్కరినీ ఒకరు గౌరవిం చుకోవడం మన తెలంగాణ సంస్కృతి అని తెలిపారు. మొన్న వినాయక నిమజ్జనానికి మిలాద్‌ ఉన్‌ ‌నబి వాయిదా వేసుకున్నారని తెలిపారు.ఎవరో వచ్చి ఏదో చెబితే కాదని, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కడైనా ఉన్నారా అని అన్నారు.ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని మోడీ అన్నారని,  మోడీ పైసలు రాలే కానీ…కేసీఆర్‌ ఇచ్చిన డబ్బులు మీ అకౌంట్లలో పడుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి కి మెట్రో రావాలన్న, ఐటీ హబ్‌ ‌కావాలన్న అది కేసీఆర్‌ ‌కే సాధ్యమని తెలిపారు. బిఆర్‌ ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని, మీరే నా బలం, బలగం అని అన్నారు. ఒడినా ప్రజల మధ్యనే ఉంటూ కరోనా సమయంలో సేవా చేశానని అన్నారు. ఈ  సభలో బి ఆర్‌ ఎస్‌ ‌నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *