సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బీడు బడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకే దక్కిందని చిన్నకోడూర్ ఎంపిపి మాణిక్య రెడ్డి తెలిపారు. రైతులకు సాగునీరు త్రాగునీరు ఉచిత విద్యుత్తు సరఫరా ఇలా ఎన్నో పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి కసారంపల్లి కొత్తపల్లి గ్రామాల్లోని కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీపీ మాణిక్య రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ తెలిపారు .మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. సిద్దిపేట నియోజకవర్గ ఇతర నియోజకవర్గాల ప్రజలకు హైదరాబాద్ పోయే ఇబ్బందులు తప్పినట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నట్లు తెలియజేశారు .బిఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ప్రజలందరికీ సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలియజేశారు. 400 గ్యాస్ అందిస్తున్నట్లు తెలియజేశారు. కొత్తపల్లి, కసారంపల్లి గ్రామ ప్రజలు హరీష్ రావుకు ఓటు వేస్తామని తీర్మానం కాపీలు అందజేశారు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తీర్మానం కాపీ అందజేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని డిమాండ్ చేశారు.హరీష్ రావు పైన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు .నిరంతరం ప్రజా సేవకు అంకితమైన హరీష్ రావు పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తస్మా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.భారత దేశంలోనే అత్యధిక మెజార్టీతోనే హరీష్ రావును గెలిపిస్తామని తెలియజేశారు. గ్రామంలోని ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఎంపీపీ కి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మ పాట ఆడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు పాపయ్య గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచు మహేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరువు ను ప్రాలదోలి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి హరీష్ రావుదే





