కమ్యూనిస్ట్ ‌భావజాలం నుంచి బిజెపి చెంతకు

  • పవన్‌ ‌కల్యాణ్‌ ‌మాటలకు..చేతలకు పోలీకేది?
  • మణిపూర్‌ ‌తగులబడుతుంటే ఇదేనా మోదీ తీరు
  • డియా సమావేశంలో మండిపడ్డ సిపిఐ నారాయణ

న్యూ దిల్లీ, జూలై 20 : పవన్‌ ఆలోచనలకు, చేతలకు పోలిక లేదని జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌దిల్లీ  పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కమ్యూనిస్ట్ ‌భావజాలం ఉన్న వ్యక్తి బిజెపితో అంటకాగడం సరికాదన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన డియాతో మాట్లాడుతూ.. పవన్‌ ‌కళ్యాణ్‌ ఎన్డీయే టింగ్‌ ‌వచ్చారని తెలిపారు. పవన్‌ ‌చేగువేరా డ్రెస్‌ ‌వేసుకొనేవారన్నారు. ఆయన లైబ్రరీలో కూడా వామపక్ష పుస్తకాలు ఉండేవని, చదివే వారని… తాము కూడా గతంలో దగ్గర అయ్యామని తెలిపారు. వైసీపీని  ఓడించాలని పవన్‌ ‌కళ్యాణ్‌ ‌తిరుగుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీతో కలిసి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారని చెప్పారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డుతో గతంలో పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పోల్చారని గుర్తు చేశారు. టీడీపీ, బీజేపీ కలుస్తుందో లేదో తెలియదన్నారు. టీడీపీ వాళ్ళతో కలుస్తుందో కూడా తెలియదని.. చంద్రబాబు కూడా ఎక్కడ చెప్పలేదన్నారు. పవన్‌ ‌కళ్యాణ్‌ను యువత నమ్మతోందని.. వారికి అన్యాయం చేయొద్దని అన్నారు.

నాపై సోషల్‌ ‌డియాలో దుష్పచ్రారం చేసినంత మాత్రాన నాకు ఏమి కాదని అన్నారు. పవన్‌ ‌కళ్యాణ్‌ ‌సంధానకర్తగా వ్యవహరించొద్దని సూచించారు. కేంద్రం విభజన హాలు సహితం అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా పోయిందని, ప్యాకేజీ లేదని.. స్టీల్‌ ‌ప్లాంట్‌ అమ్ముతున్నారని మండిపడ్డారు. స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌దొంగ చేతికి ఇచ్చినా రూ.3 లక్షల కోట్లు వస్తాయని.. కానీ రూ.30 వేల కోట్లకు ఆదానికి ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇది అడిగితే జగన్‌ ‌జైలుకు వెళ్తారంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ ‌మండిపోతుందని, ఈ విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కొన్ని నెలలుగా అల్లర్లు జరుగుతుండగా, మహిళలను వివస్త్రగా చేసి లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన ఉదంతం బయటికు రాగానే కేంద్రం స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇన్నాళ్లు మణిపూర్‌ అల్లర్లపై స్పందించని ప్రధాని, పార్లమెంటు లోపల మాట్లాడాల్సిన అంశాన్ని, డియాతో మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ నంబర్‌ ‌వన్‌ ‌బ్లాక్‌ ‌మెయిలింగ్‌ ‌పార్టీలా మారిందని ఆరోపించారు. మణిపూర్‌లో అదానీ కంపెనీలకు 55 వేల ఎకరాల భూములు కట్టబెట్టడానికే తెగల మధ్య రిజర్వేషన్‌ అం‌శాలపై కోర్టు ద్వారా ఆర్డర్‌ ‌తెచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై 26న దేశవ్యాప్తంగా సేవ్‌ ‌మణిపూర్‌ ‌పేరుతో సీపీఐ మణిపూర్‌కు మద్దతుగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తెలుగు రాష్టాల్రకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని, కేంద్రం విభజన చట్టాలను అమలు చేయడం లేదన్నారు. బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌గురించి పట్టించుకోవడం లేదని, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఏర్పాటు చేయాలనేది 30-40 ఏళ్ల కల అని పేర్కొన్నారు. కోచ్‌ ‌ఫ్యాక్టరీ స్థానంలో రూ. 500 కోట్లతో డబ్బా రేకులు తెచ్చి పెట్టారని విమర్శించారు. గుజరాత్‌లో రూ. 20 వేల కోట్లతో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని నారాయణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *