కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల కొరకు బుధవారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కమ్యూనిటీ హాల్ కొరకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. కాలనీలో చిన్నపాటి సమావేశాలు నిర్వహించడం కొరకు కమ్యూనిటీ హాల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నాణ్యతతో కూడిన పనులను త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా కార్యదర్శి ఖైల, భీమ్ రావు, స్వామి గౌడ్, బీరప్ప, దొరబాబు, తుకారాం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



