కన్నుల పండుగగా గణేష్‌ ‌విగ్రహాల నిమజ్జనాలు

  • కిక్కిరిసిపోయిన ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాలు
  • గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు
  • రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్‌ ‌లడ్డూ ధర
  • బండ్లగూడ జాగీర్‌ ‌విల్లాస్‌లో వేలంలో రూ. 1.26 కోట్లు పలికిన లడ్డూ ధర

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌హుస్సేన్‌సాగర్‌లో గణనాథుల నిమజ్జనం గురువారం ఉదయం నుంచి కన్నుల పండుగగా కొనసాగుతున్నది. తెలుగు రాష్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్‌ ‌మహా గణపతి కూడా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గణేశ్‌ ‌శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ ‌వి•దుగా ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్‌ ‌మార్గ్‌కు చేరుకుని, మధ్యౄహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్‌ ‌గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. కాగా, ట్యాంక్‌బడ్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌పరిశీలించారు.

జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌విజయ లక్ష్మితో కలిసి బోట్‌లో తిరుగుతూ నిమజ్జనం ఏర్పాట్లు, క్రేన్లను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఇక ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌వైపు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. దీంతో ఎల్బీ స్టేడియం, అబిడ్స్ ‌వరకు నిమజ్జనం కోసం వొచ్చిన వినాయకులు భారీగా నిలిచిపోయారు. ఇక సికింద్రాబాద్‌ ‌వైపు నుంచి ట్యాంక్‌బండ్‌కు పెద్ద సంఖ్యలో గణనాథులు తరలివచ్చారు. తీరొక్క వినాయక విగ్రహాలు, యువకుల నృత్యాలు, డీజే పాటలు, బ్యాండ్‌ ‌సౌండ్లతో హైదరాబాద్‌ ‌వీధులు మారుమ్రోగాయి. ఇక ఖైరతాబాద్‌ ‌గణనాథుని నిమజ్జనం పూర్తయిన అనంతరం వినాయకుల నిమజ్జనాలు మరింత ఊపందుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *