కనుల పండువగా జరిగిన ‘ఆండాళ్’ తిరునక్షత్ర మహోత్సవం

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 22: కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించిన గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం శనివారం కనుల పండువ గా జరిగింది. శ్రీరంగం, శ్రీవల్లి పుత్తూరు, శంషాబాద్ దివ్య సాకేతం, భద్రాచలం తదితర ఆలయాల్లో ఆండాళ్ పుట్టినరోజు పండుగ వైభవంగా జరిగింది. వనస్థలిపురం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు పారాయణం జరిగింది. గోదాదేవి విగ్రహాలకు తులసీమాలలు వేసి అందంగా ముస్తాబు చేసి,”రావమ్మ గోదా ఓ చూడి కొడతా అంటూ భక్తి గీతాలు ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *