నేనెప్పుడు చూడలేదు పాత
ఉదయాలను
ప్రతి ఉదయం నవోదయమే !
ఉదయ సంధ్యా సమయాలు
ఎప్పుడూ ఆహ్లాదకరమే !
ఉదయాలను ఎన్ని చూస్తున్నా
ప్రతి ఉదయం
కొత్తగానే ఉదయిస్తుంది కదా !
గత ఉదయాలు మిన్న మిన్న గా
పాతబడిపోవడం అంటే
మెల్ల మెల్లగా అంతరించి పోవడమే!
చల్లని సాయంత్రాలు మండు
టెండలు కొత్తగానే
నిరంతరం క్షణం క్షణం అనుక్షణం
కాలం రోజు సరి కొత్తగానే !
కాలం కనిపించదేమో కానీ
కనిపించే ప్రకృతి పరిణామం
కాల ధర్మమే !
కాలానికేమి ! దేన్నీ పట్టీంచుకోదు!
నవ్వులను దుఃఖాలను
కావడి కుండలుగా సమానంగా
మోసుకుపోవడమే!
తామరాకుపై నీటి బొట్టు చందంగా
ఏమీ పట్టనట్టు!
కాలాన్ని అనుకరిస్తే
ప్రతిరోజు కొత్తగా సరికొత్తగానే !
పి.బక్కారెడ్డి
9705315250





