కదన భేరి కి తరలి వెళ్లిన ఏబీపీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : ఏబీవీపీ కదనభేరి బహిరంగ సభకు కడ్తాల్ మండలం నుంచి విద్యార్థులు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కదనభేరి బహిరంగ సభ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు క్యామ శ్రీకాంత్ మాట్లాడుతూ మార్పు కోసం మహా ఉద్యమం వెళ్లడం జరిగిందన్నారు. నిరుద్యోగులా, రైతన్నలా పోరాటంతో తెలంగాణ తెచ్చుకొని దశాబ్ది కాలమైన ఏ యొక్క రంగం కూడా అభివృద్ధికి నోచుకోలేదు.. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. సభకు తరలి వెళ్లిన వారిలో నేనావత్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు మురళి, పవన్, శ్రీకాంత్, ఉమేష్, మహేష్, వేణు, సంజయ్, రాఘవేందర్, సందీప్, విద్యార్థులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *