కత్తులు దూర్చని కారడవి!

పాతబడిన గోడలేనా దేశం
ప్రవహిస్తున్న కాలువల్లో
రక్తం ఇంకిపోక ముందే
కళ్ళు తెరిచిన పసిగుడ్డ
కాంక్రీట్‌ ను నమ్ముకుంది

తనను పూర్తిగా ఆకలితో
ఉంచుకోలేక కాబోలు
ఎర్రటి నీడన చేరాల్సింది
ద్వారాలు తెరిచి
బారాలను బలహీనపరుచుకుందేమో
కాసులు కురిసాయి
నడిచి నడవనట్టు
కదిలి కదలనట్టు
ఉండి ఉండనట్టు
అర్థం కాదు ఏం జరుగుతుందో
కడుపునిండా తిని తాగి
బాగా వెనకేసుకుంటే చాలు
ఇంకేముంది అన్నట్లు
నిర్వచించుకుంది
అందుకే ఎవ్వడు బడితే వాడు
ఒల్చుకు తింటున్నాడు
శైలి వేరు పరమార్థం ఒకటే
ఆసన్న భుజం ఒక చెట్టున
అక్కడక్కడ కూని రాగాలు తీస్తూ
పుల్లలు విసురుతుంది
బాగా మొద్దు బారిన మొసలి మీదికి
పదునైన నికార్సైన మెరుపు
కత్తులు దూర్చాల్సింది పోయి!!
– రవీర్‌        

 9603245215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *