ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : కడ్తాల మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ షేక్. ముంతాజ్ ను కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు మల్లయ్య, బిక్షపతి, గణేష్, ఏఎంసీ డైరెక్టర్ లయక్ అలీ, నాయకులు యాదగిరి రెడ్డి, రామచంద్రయ్య, మంకీ శ్రీను, రమేష్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.



