ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను కడ్తాల్ పట్టణంలో జరుపుకున్నారు. ఈ వేడుకలను జడ్పీటీసీ దశరథ్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి అబ్దుల్ కలాం అని, భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జోగు వీరయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎల్ ఎన్ రెడ్డి, సులోచన సాయిలు, యాదయ్య, హరి చందు నాయక్, తులసి రామ్ నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాం నాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.



