కందుకూరు ఘటనపై ఎపి సిఎం జగన్‌ ‌దిగ్భ్రాంతి

  • చంద్రబాబు సభలో 8 మంది తొక్కిసలాట మృతిపై ఆందోళన
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన

అమరావతి, డిసెంబర్‌ 29 :‌నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తీవ్ర దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్వీట్‌ ‌చేసింది. అటు ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు   ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోడీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగసభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. దీంతో అక్కడ తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు రోడ్డు పక్కనున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయారు. వెంటనే టీడీపీ లీడర్లు, మిగతా కార్యకర్తలు అప్రమత్తమై గాయపడిన వారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 8 మంది చనిపోయారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్ ‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబా లను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇదిలావుంటే  కందుకూరు ఘటన బాధాకరమని మంత్రి రోజా పేర్కొన్నారు. పబ్లిసిటీ పిచ్చి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు 8 మంది ప్రాణాలను బలిగొన్నాడ న్నారు. ఇరుకైన ప్రదేశంలో సభను పెట్టి.. ఎక్కువ మంది ప్రజలు తన సభకు వచ్చినట్లు చూపించేందుకు చంద్రబాబు యత్నించాడని రోజా దుయ్యబట్టారు. న్యాయస్థానం స్పందించి.. సుమోటోగా కేసు నమోదు చెయ్యాలన్నారు. చంద్రబాబుని ఏ-1ముద్దాయిగా చేర్చి.. హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు. 8 మంది ప్రాణాలను బలిగొనడం.. చంద్రబాబు రాజకీయంగా చేసిన హత్య అని రోజా పేర్కొన్నారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు.. గాయపడిన వారికి కోటి రూపాయలు చొప్పున టీడీపీ చెల్లించాలని రోజా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *