కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి ప్రజలకు సేవ చేస్తా 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి గుండా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ మాడుగుల మండలంలో మావోయిస్టులు తనపై బుల్లెట్ల వర్షం కురిపించిన బతికి బయటపడ్డానని రాజకీయంగా తనకు జన్మనిచ్చింది కల్వకుర్తి ప్రజలని.. పునర్జన్మ ఇచ్చింది మాడుగుల మండలం అని మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కల్వకుర్తిని మరింత అభివృద్ధి పరుస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎ డ్మాసత్యం, ఆమనగల్ జడ్పిటిసి అనురాధపత్యానాయక్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు  జక్కు అనంతరెడ్డి, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, తోట గిరి యాదవ్ శ్రీనివాస్ రెడ్డి, కమటం రాధమ్మ వెంకటయ్య, పోలేపల్లి మాజీ సర్పంచ్ సత్యం యాదవ్, గండికోట శంకర్, రమేష్ నాయక్ సురమల్ల సుభాష్ తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *