తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రోహిత్ రెడ్డి మనోహర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మచిలీపట్నం మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి,. కూతురు మనిషా రెడ్డిల తో కలిసి పట్టణంలోని జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి యాలాల మండలంలో ఓటు వేశారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం స్వగ్రామైన ఇందర్ చెడ్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, సోదరుడు రితేష్ రెడ్డిలు ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుయ్యని మనోహర్ రెడ్డి పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలో సతీమణి అరుణమ్మతో కలిసి ఓటు వేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ భర్త పరిమళ్ గుప్తతో కలిసి ఓటు హక్కు వి నియోగించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ యాలాల మండలంలో ఓటు వేయగా ఆమె భర్త డాక్టర్ సంపత్ కునూర్, కుమారులు తాండూరు పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆర్డీఓ కార్యాలయ వెనుక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వియోగించుకున్నారు. వారితో పాటు పట్టణానికి చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మహేందర్ రెడ్డి




