తాండూరు తహసీల్దార్ తారా సింగ్
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : బిఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పక్కగా చేపట్టాలని తాండూరు తహసిల్దార్ తారా సింగ్ అన్నారు. రాబోయే పంచాయతీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బుధవారం తాండూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తారాసింగ్ ఆధ్వర్యంలో ఎంపీఓ రతన్ సింగ్,బిఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారా సింగ్ మాట్లాడుతూ .. రాబోయే, గ్రామ పంచాయతీ,లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిఎల్ఓలు పట్టణంతోపాటు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి మరణించిన వారి ఓట్లు అలాగే 18 సంవత్సరాలు నిండిన ఓట్లను నిర్ధారణ చేసుకొని మార్పులు చేర్పులు చేపట్టాలని సూచించారు. 2024 కు సంబంధించి ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు అలాగే తొలగింపులు పక్కాగా నిర్వహించాలని, వాటిల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండ చూడాల్సిన అవసరం ఉందని బిఎల్ఓలకు సూచించారు. దీనికి సంబంధించి బిఎల్వోలు జాగ్రత్తగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులు ఏరోజుకారోజు పరిశీలించాలని తెలిపారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన ఓటర్ల లిస్ట్ పక్కాగా ఉండాలని ఇందులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ రతన్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ , బిఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.





