మనిషెప్పటికి మారనితనాన్ని ముసుగేసుకుని
మొండితనాన్ని మెడలేసుకుని
మొరటుతనాన్ని వీడక
మోడువారుతున్న వృక్షమై
కూలుతున్న బతుకుతో
ఊతంకోసమెదురుచూసే
బేలచూపులతో బిచ్చగాడౌతున్నడు
ఎంత కష్టంజేసిన బతుకుబండక్కడే కూలవడ్డది
ఈతిబాధలెన్నైనా ఈదుతునేవున్నా
దేహన్నంతా నలుగొట్టుకున్నా
దాహంతీరక తీరంచేరక
గొంగడక్కడే పాతుకుపోయింది
అప్పులకుప్పలు కాళ్ళకు సంకెళ్ళైనయ్
ఎంతదూరంబోయిన ఎంటాడతనె వుంటయ్
గుండెల దిగులైతే తోయనితనాన్నంటించి
నిద్రనంతా ఆమడదూరం విసేరేసింది
పాడుబతుకుంతా ఆగమాగమయితుంటే
భూమి గిర్రునదిరిగి ఆడికేవచ్చినట్ల
ఏముకలన్నరిగినా మార్పయితేలేదాయే
పానమంత అరచేతిలవట్టుకుని ఆడికిడికిబోయినగని
ఆకలైతే బతుకుల్ని శాసిస్తుండది
ఏంజేసిన ఏట్లచింతపండు పిసికినట్లేనయే
కళ్ళెక్కడజూస్తే మనసక్కడలాగవట్టే
కాల్లు మాత్రం
కష్టంజేసిన తోవలోనే సాగుతున్నయ్
జీవనగమనందెలిసిన పయనం సాగుతుంటే
లుకలుకల బతుకలో
ఇకఇకలు పకనకలసలే లేవు
నాచేతుల పనితనం
ఎటుజూసిన మాబాగా కానొస్తుండది
కానీ
ఎట్టి బతుకుల పోరాటం
మెతుకులకై ఆరాటమంట
సంసారభారమంతా బజాలమీదుండే
సపాటు నగుబాటు గాకుండా సాగితే సాలనట్లుండది
– సి. శేఖర్(సియస్సార్) పాలమూరు, 9010480557.




