ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్, అక్టోబర్ 26 : ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉండి సేవలందిస్తానని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీం భరత్ అన్నారు.గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ మాట్లాడతూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని అన్నారు.గెలిస్తే ఉంటావా..పార్టీలో ఉంటావా..మారుతావా అంటున్నారు..కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందంటే.. ప్రాణమైన ఇస్త కానీ..పార్టీ నీ వదలను..ఆనాడు సీపీఐ నాయకులు శ్రీనివాస్ నాయుడు నేతృత్వoలో పనిచేశానని..1995లో 2000 ఓట్లతో ఓడిపోయానని అన్నారు.ఆప్పట్లో నన్ను చంపాలని కూడా కిడ్నాప్ చేశారు.ఆ రోజుల్లో ఆ పరిస్థితి 3 రోజులు షాబాద్‌లో కర్ఫ్యూ కూడా విధించారని అన్నారు.తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి రుణం తీర్చుకుందామన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ వాగ్దానం నిలబెట్టుకోలేదని,చేవెళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో గెలిచిన యాదయ్య అధికార పార్టీలో కలిశారని గుర్తు చేశారు.చేవెళ్లకు ఇప్పటి వరకు కనీసం ఆర్టీసీ బస్సు డిపో కూడా లేని దుస్థితి నెలకొన్నదని గుర్తుచేశారు.చేవెళ్లకు ఇప్పటి వరకు యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఏస్ రత్నo ఇద్దరు పదవులు అనుభవించారు కాని చేవెళ్ల అభివృద్ధిని విస్మరించారని అన్నారు.కలసి పని చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కంకన బద్దులమవుదామన్నారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి,సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి,పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి,ప్రతాపరెడ్డి,బుచ్ చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పెంటయ్య గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా,మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్న గారి శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్,ఓబీసీఎల్ ప్రెసిడెంట్ సూర్యాపేట శ్రీనివాస్ గౌడ్,మహిళా అధ్యక్షురాలు దేవర సమతా రెడ్డి,అసెంబ్లీ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపల్లి పెంటారెడ్డి,యువజన మండల యూత్ అధ్యక్షుడు మధ్యల శ్రీనివాస్,మైనారిటీ నాయకులు మహమ్మద్ ఖదీర్ పాషా,వాజిద్ భాయ్, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు,మాజీ ఎంపీటీసీ కృష్ణవేణి రాములు, మాజీ సర్పంచులు పడాల ప్రభాకర్,అనంతరాములు గౌడ్, కావలి వెంకటేష్,డీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,పాండు యాదవ్,యాలాల్ మహేశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉంటా




