ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తా మందముల ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 3:  ఒక్కసారి అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తానని , ఉప్ప‌ల్ గ‌ల్లీల్లో పుట్టిన   మీ పెద్ద కొడుకుగా  ఆశీర్వదించండి అని  ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పరమేశ్వర్ రెడ్డి  జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, అధికారంలోకి రాగానే 100రోజుల్లోనే నెర‌వేరుస్తామ‌న్నారు.ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారాన్ని మ‌రింత ఉధృతం చేశారు. ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు ఆ పార్టీ అభ్య‌ర్థి ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. నాచారం డివిజ‌న్ లోని బాబా న‌గ‌ర్, రాంరెడ్డి న‌గ‌ర్, ఎలుక‌ల బ‌స్తీ, శ్రీ‌రామ్ న‌గ‌ర్, నాచారం విలేజ్, న్యూ అంబేద్క‌ర్ న‌గ‌ర్ ల‌లో మ‌హా పాద‌యాత్ర‌గా ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌గా, ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న లభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *