ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే లక్ష్యం మీ ముంగిట్లో

కెసిఆర్‌ ‌జీవితమే ఒక ఉదాహరణ
గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ ‌మీట్‌లో మంత్రి కెటిఆర్‌
‌సిఎం కెసీఆర్‌ ‌విజన్‌ ‌వల్లే ఎస్‌టి ఎంటర్‌‌ప్రెన్యూర్స్ ‌తయారవుతున్నారు : మంత్రి సత్యవతీ రాథోడ్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్‌ ‌జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్‌ ‌విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్‌ ‌పార్క్ ‌హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్‌ ‌వి•ట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌మాట్లాడుతూ..గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్‌ ‌తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు. ఎస్టీ ఆంథప్రెన్యూర్స్ ‌కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని చెప్పారు. చాలా ఎత్తుకు ఎదగాలని కలలు కనాలని, అలాంటివారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్దిదారులు రైస్‌ ‌మిల్‌ ‌పెట్టుకున్నారని తెలిపారు.

అదేవిధంగా వాటర్‌వర్కస్‌లో దళితబంధు కింద 150 వాహనాలు ఇచ్చామని వెల్లడిచారు. ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసేవాళ్లకు పోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. వొచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్‌ ‌వి•ట్‌ ‌జరుపుకుందాని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. సీఎం కేసీఆర్‌ ‌విజన్‌ ‌వల్లే ఎస్టీ ఆంథప్రెన్యూర్స్ ‌తయారవుతురన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రి కేసీఆర్‌ అన్నివిధాలు సహకారం అందిస్తున్నారని, గతంలో పార్టీలు, ప్రభుత్వాలు గిరజనులను పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌పాలనలో గిరుజనులు అభివృద్ధి చెందారని, గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగారన్నారు.

గిరిజన ప్రాంతాలను తాండాలను ఎంతో అభివృద్ధి చేశామని, కరెంటు లేని రోజు నుంచి కరెంటు చూసేలా చేసామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గిరిజన బిడ్డలకు కొత్త జీవితాలు ఇచ్చారన్నారు. గిరిజనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉందని, గిరిజన రిజర్వేషన్‌లు పెంచుకున్నామని, దాంతో అనేక మందికి మెడికల్‌, ఇం‌జనీరింగ్‌ ‌సీట్లలో అవకాశాలు వొచ్చాయన్నారు. గిరిజనులకు పోడుపట్టాలు అందించామని, గత ప్రభుత్వాల 65 ఏళ్ల పాలనలో 91 గిరిజన గురుకులాలు ఉంటే స్వరాష్ట్రంలో 98 ప్రత్యేక గురుకులాలు ఉన్నాయని, ప్రజల ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని సాధిస్తూ ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం తీవ్రంగా నష్టపోతామని •మంత్రి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *